పాలకుర్తి నేటిధాత్రి
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన బైరుపాక రాములు మూడు రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి.హరిష్, చెరిపల్లి అశోక్, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సూర్యప్రకాష్ (టీచర్) కి ట్రస్ట్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.