సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్
రామడుగు, నేటిదాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎఏంసి చైర్మన్ మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రేషన్ డీలర్ నార్ల మంగ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.