ప్రాణాలు కాపాడటంలో సమయమే కీలకం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కేంద్రానికి అంబులెన్స్ సౌకర్యం లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండ లంలో 24 పంచాయతీలు మండల కేంద్రంలో కలిపి దాదాపు 50వేలకు పైగా జనాభా ఉంది .గర్భిణీలు, రోడ్డు ప్రమాద బాధితులు, గుండె జబ్బులు వంటి అనేకమంది బాధితులకు అత్యవసరమైన వైద్య సేవలు అవసరం ప్రమాదంలో గాయపడిన రోగులను తరలించడానికి 108 ఫోన్ చేస్తే పక్క మండలాలైన పరకాల, ఆత్మకూరు నుంచి అంబులెన్స్ రావాల్సిందే ఆయా ప్రాంతాల్లో బాధితులను తరలిస్తుంటే మాత్రం వీరికి మొండిచెయ్యి. మండలానికి అంబులెన్స్ సౌకర్యం లేక మండల ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఆ సమయానికి ప్రైవేటు వాహనాలు అందుబా టులో లేకుంటే ప్రాణాలకే ముప్పు తమ మండలానికి అంబులెన్స్ కేటాయిస్తే సరైన సమయంలో వైద్య సేవలు అందుతాయని అంతేకాక
మండల కేంద్రానికి వస్తు పోతున్న క్రమంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే క్షతగాత్రు లను తరలించేందుకు ప్రైవేటు వాహనాలు దిక్కవుతున్నాయి ఆసుపత్రి ఖర్చులకే ఇబ్బం దులు పడుతున్న పేదలకు ప్రైవేటు వాహనాల కిరాయిలు మరింత భారంగా మారుతు న్నాయి అంబులెన్స్ సౌకర్యం కోసం పలుమార్లు ప్రజాప్రతి నిధులకు అధికారులకు విన్నవించిన పట్టించు కోవట్లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటంలో సమయమే కీలకము సకాలంలో అంబు లెన్స్ రాక ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నా రు.అంబులెన్స్ సౌకర్యం కల్పించి ప్రాణాలు రక్షించాలని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.108 అంబులెన్స్ వాహన సదు పాయం కల్పించాలి. ప్రమాదం జరిగితే ఆత్మకూర్ పరకాలకు గాని 108 కు ఫోన్ చేసినట్లయి తే వాళ్లు వారి ప్రాంతంలోనీ సమస్యల పైన వేరే గ్రామాల్లోకి వెళ్లే క్రమంలో తిరిగి మా శాయంపేటకు రావాలంటే దాదాపు గంట సమయం దాకా పడుతుంది కాబట్టి దయచేసి ప్రజాప్రతిని ధులు అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరువచూపి 108 సౌకర్యం కల్పించి ప్రాణా లను కాపాడాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.