ఇప్పటికైనా మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

అంబులెన్స్ ఉంటే ప్రాణాలు దక్కేవి?

సిపిఐ మండల నాయకులు మారేపల్లి క్రాంతికుమార్

శాయంపేట నేటిధాత్రి : శాయంపేట మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటన చాలా బాధాకరం. ఈ ప్రమాదానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని అన్నారు. మండలంలో 24 గ్రామపంచాయతీలు అతిపెద్ద మండలం ఈ మండలానికి 108 వాహనం కావాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే, నిర్లక్ష్యం కారణంగానే మూడు ప్రాణాలు బలైపోయాయని అన్నారు.నిన్న ప్రమాదం జరిగి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం ఫోన్ చేయగా వాహనం రావడానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది,ఒకవేళ ఇక్కడ ఆ వాహనం గనుక ఉన్నట్లయితే ప్రాణాలు దక్కేవని అన్నారు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే ప్రాణాలు పోయిన తర్వాత ఆ కుటుంబాలకు కొన్ని డబ్బులు ఇవ్వడమా? అని ఎద్దేవా చేశారు,ఇప్పటికైనా స్పందించి మరో ప్రాణం బలైపోక ముందే 108 వాహనాన్ని ఏర్పాటు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేయడం జరిగింది.అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు 9సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ వారు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ఇల్లు ఇవ్వకపోవడంతోనే ఈ సంఘటన జరిగింది అని అన్నారు.ఈ రాష్ట్రంలో ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇళ్లలో బ్రతకలేక ఇలాంటి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోనే ఉండి ఇలా మృత్యువాత పడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తే ఈరోజు ఈ ప్రాణాలు దక్కేవి అని గుర్తు చేశారు.ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల్లారా అభివృద్ధి అంటే మీ ఆస్తులు పెంచుకోవడమా, దృఢంగా ఉన్న భవనాలను మీ కమిషన్ల కోసం కూల్చి కోట్ల రూపాయలు వృధా చేసి తిరిగి భవనాలను మాత్రమే కట్టడమా ఇదేనా అభివృద్ధి అంటే మీ దృష్టిలో అని హెచ్చరించారు.
తక్షణమే ఈ ముగ్గురు కుటుంబాలకు ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని, ప్రభుత్వ తప్పిదం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని భావించి మృతుల ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అరికిళ్ల దేవయ్య, బి ఎస్ ఎస్ ఉమ్మడిజిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, ఏ బీ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుల పవన్ కళ్యాణ్, రాజ్ కుమార్,రాజు, కిరణ్, తదితరులు సంఘీభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!