డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలి
-జక్కి శ్రీకాంత్
వర్దన్నపేట (నేటిదాత్రి)
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న “మహనీయుల స్ఫూర్తి యాత్ర” లో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా నాయకులు దోమకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరుపట్ల బాబు, బిజెపి వర్ధన్నపేట ప్రధాన కార్యదర్శి డోలి సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కుల పెద్దమనుషులు బిరు యాకయ్య, బిర్రు మామునూర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపాది శ్రీనివాస్, తక్కలపల్లి వెంకటేశ్వరరావు, కాంభోజ యాకయ్య, కాంభోజ సాయిలు, బిర్రు కుమారస్వామి, బిర్రు చంద్రయ్య పిటి, మంద ఎల్లయ్య, సమ్మయ్య, వెంకటయ్య, సమ్మయ్య, సాయిలు, వివిధ కుల నాయకులు పాల్గొన్నారు