Congress Pays Tribute on Ambedkar Anniversary
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ .ఆయన దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ. ఆయన రాసిన.రాజ్యాంగంతో భారతదేశంలో ఎన్నో కుటుంబాలు రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాలు పొందుతూ అలాగే ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్దేశంతో ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాజ్యాంగం రచించి భారతదేశంలోని వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రపంచంలోనే మేధావిగా పేరు తెచ్చుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టలను దేశ దేశాన్ని తీసుకెళ్లి భారత పేరు తను రచించిన రాజ్యాంగం ద్వారా పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా.నివాళులర్పిస్తూ జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి. అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
