Ambedkar’s 69th Vardhanti Held Grandly
ఘనంగా అంబేద్కర్ 69 వ వర్ధంతి వేడుకలు
నస్పూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం అంబేద్కర్ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.శనివారం అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ వర్ధంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకుంటామని,బలహీన వర్గాల సంక్షేమ,సమానత్వ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి అని అంబేద్కర్ నీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం,కోయల కొమురయ్య,ఇరికిల్ల పురుషోత్తం,అంబేద్కర్ సంఘం యూత్ అధ్యక్షుడు మాడుగుల మహేష్, మాడుగుల రాజ్యం,కొప్పర్తి సురేందర్, అంజి,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
