
అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ముల్కల రాందాస్
లక్షెట్టిపేట,నేటిధాత్రి అక్టోబర్ 6:
అంబేద్కరిస్టులు ప్రజా సమస్యలపై పోరాడాలని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ముల్కల రాందాస్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీని మండల అధ్యక్షులు ముల్కల రాందాస్,జిల్లా నాయకులు శెనిగరపు లింగయ్య, దమ్మ నారాయణ, చాతరాజు రాజన్న, మాలెం చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి బైరం రవి, వైస్ ప్రెసిడెంట్ బైరం లింగయ్య, ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నాయకులతో కలిసి మండల అధ్యక్షులు మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
నూతన కమిటీ ఎన్నిక
పట్టణ అధ్యక్షులుగా తొగరి రాజు, ప్రధాన కార్యదర్శిగాలు అల్లం పెళ్లి రమేష్, ఉపాధ్యక్షులు కోడి మల్లయ్య, చిలుముల నర్సన్న, గుత్తికొండ శ్రీధర్, కల్లేపల్లి విక్రమ్, కండి మొగిలి, జాయింట్ సెక్రటరీ మంచాల కుమార్, ప్రచార కార్యదర్శి బిరుదుల సత్యనారాయణ,కోశాధికారి కోడి కుమార్,మీడియా ప్రతినిధి కూడెల్లి వరుణ్, నంది తిరుపతి, పెండెం రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.