అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులుగా యుగేందర్ ఎన్నిక.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏవైఎస్ మండల నూతన కమిటీ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడుగా జన్నె యుగేందర్,ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ లను ఎన్నుకోవడం జరిగింది,ఉపాధ్యక్షులుగా కనకం తిరుపతి,గుర్రం అశోక్,సహాయ కార్యదర్శిలుగా దాసరపు నరేష్,బోనగిరి తిరుపతి, ప్రచార కార్యదర్శిగా కట్కూరి రాజు, కోశాధికారి కట్కూరి రాజేందర్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు యుగేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు , ఈ కార్యక్రమంలో ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య, చిట్యాల మండల గౌరవ అధ్యక్షుడు గుర్రపు రాజేందర్,ఏవైఎస్ సభ్యులు సరిగోమ్ముల రాజేందర్, కట్కూరి రమేష్, గుర్రం రాజమౌళి, గుర్రం తిరుపతి, శీలపాక ప్రణీత్ కుమార్, మైదం మహేష్, పాముకుంట్ల చందర్,ముత్యాల సాంబయ్య, కట్కూరి శ్రీనివాస్, బొడ్డు ప్రభాకర్, అంబాల సాంబయ్య (అచ్చి) తదితరులు పాల్గొన్నారు.