జైపూర్ మండల్ పలు గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

జైపూర్ నేటి ధాత్రి

శివాజీ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ సేన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 133 వ జయంతి సందర్బంగా అంబేద్కర్ ఫోటో కి పూలమాలవేసి పాలాభిషేకం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు మరువలేనివని, కుల వివక్షను రూపుమాపి సమ సమాజాన్ని నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.ఇట్టి కార్యక్రమంలో శివాజీ సేన వ్యవస్థాపకుడు మంతెన ఉదయ్ కిరణ్, అధ్యక్షుడు మెరిమిడి గణేష్, కోశాధి కారి మంతెన రవితేజ, ప్రచార కార్యదర్శి వేల్పుల సంజయ్,సహ కార్యదర్శి వేముల సాయికిరణ్ గౌడ్, సభ్యులు గణేష్, జనగామ నితిన్ ఎం ఆర్ పి ఎస్ నాయకులు పాల్గొన్నారు.

టేకుమట్ల గ్రామంలో అంబేద్కర్ 133 జయంతి వేడుకలు

జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు నాయకులు యువకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకు విద్య ఒకటే మార్గం అని అంబేద్కర్ తెలిపిన బాటలో భావితరాలు నడవాలని గ్రామ పెద్దలు మాట్లాడారు.

ఇందారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు

జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది నాయకులు ప్రజలు అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, అపరవిద్యవేత్త, రాజ్యాంగ శిల్పి, ఉద్యమ జ్యోతి అయినటువంటి అంబేద్కర్ చూపించిన బాటలో పయనించి యువత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని తెలియజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అనిల్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *