దీక్షకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
నెక్కొండ,నేటిధాత్రి:*
నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా నెక్కొండ మండల మాల మహానాడు కన్వీనర్, కో కన్వీనర్ కారు కరుణాకర్, పోనగంటి స్వామిరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు మర్చిపోకుండా ఆయన ప్రజలు ఆయనను దేవుడని కొలవాలని భారత రాజ్యాంగం నిర్మాణం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేసి బడుగు బలహీన వర్గాలకు కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా పండుగలాగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మేధావులు అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జామండ్ల రంజిత్, కారు అనిల్, బొల్లెపల్లి విష్ణు, చీర కుమారస్వామి, సర్కిల్ రవి, చీపురు భాస్కర్, పోనకంటి ప్రశాంత్, పులి సుధాకర్, దునకన రఘుపతి, చీపురు స్వామి, తదితరులు పాల్గొన్నారు.