
Ambedkar Jayanti
సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు.
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.