
Ambedkar community leaders
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ సంఘంనాయకులు.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పర్లపెల్లి భద్రమ్మ కుటుంబాన్ని అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ బుధవారం పరామర్శించారు అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు బాధిత కుటుంబం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆర్థిక సహాయంగా అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కట్కూరి నర్సయ్య, ఆరెపెల్లి అంకూస్, బోట్ల రాజయ్య,శీలపాక రాజేందర్,అంబేద్కర్ నాయకులు అభిమానులు గుర్రం శంకర్, గురుకుంట్ల కిరణ్, కట్కూరి, సునీల్, ఆరేపెల్లి రాజు, గుర్రం అశోక్, కట్కూరి హరీష్, ఏకు మల్లేష్, మొలుగూరి సందీప్, తదితరులు పాల్గొన్నారు