చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చిట్యాల మండల తహశీల్దార్ ఎం డి ఖాజా మొహియుద్దీన్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ మండల నాయకులు గుర్రపు రాజమౌళి గురుకుంట్ల కిరణ్ కనకం తిరుపతి గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ పుల్యాల సురేష్ మైదానం మహేష్ తదితరులు పాల్గొన్నారు.