దళిత హక్కుల పోరాట సమితి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు పీక రవికాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ,ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సీల రిజర్వేషన్ 18 శాతం పెంచుతామని,ఎస్సీ వర్గీకరణ చట్టానికి చర్యలు తీసుకుంటామని ఎన్నికల హామీలు మాట ఇచ్చారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకుండా దళితులను మోసం చేసిందని, వెంటనే అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని దళితుల అభ్యున్నతి కోసం 12 లక్షల రూపాయలను విడుదల చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని రవికాంత్ కోరారు. రిజర్వేషన్లు పెంచుతూ,ఎస్సీ వర్గీకరణ చట్టానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని యెడల పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ జిల్లా నాయకులు నేరెళ్ల జోసెఫ్, ఎండి షాబీర్, ఎండి యాకూబ్ పాషా, బల్లెం రాజకుమార్, కసారబోయిన శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు