
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా రెండు బోర్ వెల్ మోటార్లు చెడిపోయి ప్రజలు నీటి సమస్యతో చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో జైపూర్ మాజీ ఉపసర్పంచ్ అంబాల సంపత్ రెడ్డి ప్రజల ఇబ్బంది చూడలేక తన సొంత ఖర్చులతో రెండు బోర్వెల్ మోటార్లను ఏర్పాటు చేసి నీటి సమస్యను తీర్చడం జరిగింది. గొప్ప మనసుతో మానవత్వం చాటుకుని ప్రజలు ఇబ్బందిని తీర్చిన అంబాల సంపత్ రెడ్డిని కాలనీ వాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కట్కూరి సత్యనారాయణ ,చీనూరి మధు ,అంబాల రవి ,మంతెన లక్ష్మణ్ , అరిగెల శ్రీనివాస్ గౌడ్, ఇరిగిరాల శ్రావణ్ ,పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్ , కాలనీ వాసులు పాల్గొన్నారు.