చేర్యాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన జితేందర్‌ను బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబాల మహేష్ గౌడ్ శనివారం డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా రాష్ట్ర నూతన డీజీపీ గా భాద్యతలు స్వీకరించిన జితేందర్ తనదైన శైలిలో శాంతి భద్రతలను నెలకొల్పాలని మహేష్ గౌడ్ ఆకాంక్షించారు.శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలకపాత్ర పోషిస్తుందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.