మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఎల్లప్పుడు రక్షణతో విధులు నిర్వహిస్తూ, రక్షణలో భాగస్వామ్యం కావాలని డైరెక్టర్ పి అండ్ పి జిఎం, రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ జి నాగేశ్వరరావు, బెల్లంపల్లి రీజనల్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్తా లు సూచించారు. సింగరేణి 54వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం వారు ఏరియాలోని కేకే 5 గనిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో అతి తక్కువ ప్రమాదాలు నమోదు అయ్యాయని, దీనికి కృషిచేసిన కార్పొరేట్ సేఫ్టీ జిఎం గురువయ్యకు అభినందనలు తెలిపారు. అనంతరం బెల్లంపల్లి రీజనల్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్తా మాట్లాడుతూ, రక్షణ కోసం ఉద్యోగులు ఆధునిక సాంకేత పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను, పనిముట్లను వాడాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. అదేవిధంగా భద్రత మన ఇంటి నుండే మొదలు కావాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు విచ్ కాంపిటీషన్ నిర్వహించి గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. అనంతరం గత సంవత్సరం నిర్వహించిన 53వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా కమ్యూనికేషన్ సెల్ కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అడిషనల్ మేనేజర్, రక్షణ తనిఖీ బృందం కో కన్వీనర్ కే ప్రవీణ్ విక్రం, రక్షణ తనిఖీ బృందం సభ్యులు సెంట్రల్ వర్క్ షాప్ ఈ అండ్ ఎం ఎస్ఇ పి సాయినాథ్, సూపరింటెండెంట్ సర్వే ఆఫీసర్ మైనింగ్ సిహెచ్ శ్రీనివాసులు, కొత్తగూడెం ఏరియా సర్వే అధికారి ఎం ప్రదీప్ కుమార్, ఎన్విరాన్మెంట్ అడిషనల్ మేనేజర్ జె శ్రీనివాసరావు, కేకే గ్రూప్ ఏజెంట్ వి రామదాసు, గని మేనేజర్ భూ శంకరయ్య, గని సంక్షేమ అధికారి కార్తీక్, సేఫ్టీ కమిటీ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.