
ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించిన పూర్వ విద్యార్థులు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ 1990-91 పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు రూ .30 వేల విలువైన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందజేశారు. బుధవారం పాఠశాలలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా క్యా తనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు మందమర్రి మండల విద్యాధికారి దత్తు మూర్తి చేతుల మీదుగా ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మండల విద్యాధికారి మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు 1990- 91 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందజేయడం అభినందనీయమన్నారు.
ఈ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని పాఠశాల చదివిన ఇతర విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ .శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కోమల, పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ లక్షెట్టి లక్ష్మణ్ మూర్తి, కో కన్వీనర్లు బావండ్ల పెల్లి శ్రీనివాస్, ఈదునూరి సారంగరావు, పి. రమాదేవి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.