ఆ ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
విద్యార్థుల వందనాలకు ,ఆశీర్వదించిన గురువులు.
ఉన్నత శిఖరాలు అందుకున్న విద్యార్థులకు చూసి గర్వంతో హత్తుకున్న గురువులు.
పూర్వ విద్యార్థులు గురువులు కలిసి చిందులు వేసిన వేళ.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
గురువు విద్య అనేది భూలోకం ఉన్నంతకాలం విద్యార్థి గురువులు గురు దేవతగా భావించాల్సిందే, అలాగే పలకనుండి ప్రారంభమైన విద్య టెక్నాలజీ వరకు తోటి విద్యార్థులను గురువులను మర్చిపోకుండా చేస్తుంది ఆ సరస్వతి తల్లి, మిడి మిడి పాదాలతో నల్ల పలుకపై రాసిన ఆ రెండు అక్షరాల సరస్వతి తల్లిని గుండెలకు హత్తుకొని వెళ్లిన ఆ సందర్భాల నుండి మొదలుకొని డెల్ లాంటి లాప్టాప్ ల ముందు కూర్చుని సాంకేతిక విద్య వరకు ఆ నల్ల పలక ద్వారా ప్రారంభమైన సరస్వతి అక్షరాలు అ ఆ లు నేడు లాప్టాప్ లో ఏ బి లుగా ఉన్నప్పటికీ ఆరోజు గొంతు చించుకొని పద్యాలు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల మధుర స్వరం ఈరోజు లాప్టాప్ లో వాయిస్ రికార్డింగ్ నువ్వు కూడా ఆ తీపి కనబడకపోవడం ఒకవైపు అయితే మరోవైపు బల్పాలు రాసిన అక్షరాలను తూర్చుకొనుటకు నీటి గడ్డి నేలపై తోపుకున్న ఆ మధుర జ్ఞాపకాలు ఈరోజు ఏసీలో కూర్చుని ఉద్యోగాలు చేస్తున్న ఆనందం లేకపోయినప్పటికీ ఆ గుర్తులను తిరిగి ఆ విద్యార్థుల్లో తీసుకువచ్చే ఆనందమే పూర్వ విద్యార్థుల సమ్మేళన వేల అని చెప్పక తప్పదు. ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాల తడబరి ఎక్కడెక్కడో స్థిరపడ్డ ఆ విద్యార్థులు జీవితంలో ఇబ్బందులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ తమ జీవితాలను కొనసాగుతూ ఒకేసారి ఆ చదువుల తల్లి రోజులను గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్వతమై ఒకరికొకరు గురువుల ఆశీర్వాదాలు తోటి విద్యార్థుల మంచి చెడులను అడిగి తెలుసుకుని ఎనలేని ఆనందం పొందే రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని కూడా చెప్పవచ్చు ఇలాంటిదే ఒక రెండు పుష్కర కాలాలు పూర్తయి ఆనాటి విద్యార్థులందరూ ఒకచోట కలుసుకొని గురువుల ఆశీర్వాదాలు తోటి విద్యార్థుల బాగోగులను తెలుసుకోవడం జరిగింది. ఆ సమ్మేళనానికి చూడడానికి వెయ్యి కళ్ళు చాడకుంట 1984 -85 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం సాగింది.
ఆ ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
40 సంవత్సరాల అనంతరం ఒకచోట పూర్వ విద్యార్థులు.
ఆదివారం రోజు స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 1984 -85వ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అటు విద్యార్థులకు ఉపాధ్యాయులకు కార్యక్రమానికి తిలకొంచుటకు వచ్చిన ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ విద్యా ఉపాధ్యాయులకు గౌరవం పై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించే నా కార్యక్రమం సాగింది. సుమారు రెండు పుష్కర కాలాలు అంటే 40 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత 85 లో పదవ తరగతి పూర్తిచేసుకుని సుమారు 180 మంది విద్యార్థులు ఒకచోట కలవడం ఇలాంటి ఉపాధ్యాయులు కూడా హాజరు కావడం ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయులను చూస్తూ ఒకరికొకరు ఆ సందర్భంలో వారికి కలిగిన ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. పదవ తరగతి విద్యాభ్యాసం పూర్తి 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ విద్యార్థులు ఒకచోట కలుస్తారని ఎవరికి కూడా ఊహల్లో కి రానటువంటి ఆలోచన మహదేవ్పూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు ఆనాటి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం హర్షనీయమని ఉపాధ్యాయులు వారికి అభినందించారు.
విద్యార్థుల వందనాలకు ,ఆశీర్వదించిన గురువులు.
మండల కేంద్రంలో జరిగినటువంటి 1984వ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నువ్వు సుమారు 180 పూర్వ విద్యార్థులు అలాగే 20 ఉపాధ్యాయులు హాజరు కావడం విశేషం. విద్యార్థులను చూసిన గురువులు గురువులను చూసిన విద్యార్థులు ముందుగా తమ గురువులు వస్తున్నారని ఆనందించిన ఆ పూర్వ విద్యార్థులు గురువులకు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రదేశానికి బ్యాండ్ మేళాలు పుష్పాలు జల్లుతూ గురువులకు స్వాగతం పలికిన విద్యార్థులను చూసిన ఆ గురువులు ఆనందంతో భావోద్వేగానికి గురికాక తప్పలేదు. పెద్ద వయసు దాక వచ్చి నా గురువులు ఈ దశలో వారికి వినలేని మర్యాద విద్యార్థుల నుండి కలుగుతుందని ఆ గురువులు కూడా ఊహించలేని విధంగా పూర్వ విద్యార్థులు వారికి ఇచ్చిన స్వాగతం ఆ గురువులు ఎన్నటికీ మర్చిపోకుండా చేశారు.
గురువులను చూసిన విద్యార్థులు దక్షిణ కొరకు విద్యార్థులంతా కలిసి తమ శిరస్సును వంచడంతో విద్యార్థులకు ఆ గురువులు స్టేజిపై నుండి ఆశీర్వదించడం గురువు విద్యార్థుల మధ్య ప్రేమను మరింత బలాన్ని ఇచ్చే విధంగా ఆ విద్యార్థులకు తమ గురువుల తోడు నేటికీ రాబోయే రోజుల్లో కూడా గురువుల ఆశీర్వాదం తమకుంటుందని నమ్మకాన్ని కలిగించింది.
ఉన్నత శిఖరాలు అందుకున్న విద్యార్థులకు చూసి గర్వంతో హత్తుకున్న గురువులు.
84వ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో హాజరైన అనేక విద్యార్థులు గురువుల ఆశీర్వాదంతో దేశం రాష్ట్రం తో పాటు అంతర్జాతీయంగా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరడం ఆ గురువులను ఎంతో గర్వాన్ని ఇచ్చింది. సమ్మేళనంలో హాజరైన 180 మంది విద్యార్థులు
సముచిత స్థానాల్లో గొప్పగా స్థిరపడి ఉండడం ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం తో పాటు పలు విద్యార్థులు రాజకీయ ప్రజా ప్రతినిధులుగా కొనసాగడాన్ని చూసిన ఆ ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి గర్వంతో అలింగనం చేసి మరింత ఆశీర్వాదాన్ని ఇవ్వడం విద్యార్థులకు కూడా నేటికీ గురువుల ఆశీర్వాదం రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని నమ్మకాన్ని కలిగించడం జరిగింది.
పూర్వ విద్యార్థులు గురువులు కలిసి చిందులు వేసిన వేళ.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకవైపు సరస్వతి తల్లి ఒడిలో ఉన్న ప్రేమ ఆప్యాయతను నేటికి మరిచిపోకుండా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు గౌరవం ప్రేమను అందించే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి సమ్మేళనంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తమ వయసుకు మించి ఆనాటి రోజులను గుర్తు తెచ్చుకొని చేసిన చేష్టలను కూడా సమ్మేళనంలో కొనసాగడం ఆనందాన్ని కలిగించింది. సినిమా పాటలతో గురువుల పై చూపించే గౌరవం విద్యార్థులు ఒకరు ఉండే చేదోడు వాదోడు లాంటి సంగీతానికి విద్యార్థులు మరియు గురువులు కలిసి చిందులు వేయడం జరిగింది. 1984- 85వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకవైపు సరస్వతీ తల్లి యొక్క విలువలను నేటికీ సమాజానికి చూపెడుతూ గురువు విద్యార్థి మధ్య సరస్వతి తల్లి యొక్క ఆశీర్వాదం కొనసాగడం జరుగుతుందని ఎన్ని సంవత్సరాలు ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా గురువు మరియు విద్యార్థి మధ్య ఆ గౌరవం ప్రేమను ఎవరు కూడా తుడిచి వేయలేరని, ప్రకృతిలో గాలి ఎంత స్వచ్ఛమైందో సరస్వతి తల్లి ఆశీర్వాదంతో విద్యాభ్యాసం చేసిన విద్యార్థి మరియు గురువుల మధ్య ఆ స్వచ్ఛమైన ప్రేమ గౌరవం ఉంటుందని సమాజంలో గురువుకు మించిన వారు ఎవరు ఉండరని ఎన్నటికీ గురువు తన విద్యార్థిని తన బిడ్డగా భావిస్తాడని విద్యార్థి ఎదుగుదలతో మొట్టమొదట ప్రపంచంలో ఆనందం పొందే వ్యక్తుల్లో మొదట స్థానం గురుదేనని అలాగే తోటి విద్యార్థులు కూడా ఆనాడు కలిసి విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఎవరు కూడా నేడు విద్యార్థి ఆర్థిక మానసిక పరిస్థితులను తోటి విద్యార్థులే వారికి ఒక పెద్ద దిక్కు అని కుటుంబంలో ఎవరు కూడా చేదోడు వాదోడుగా లేనప్పటికీ సరస్వతీ తల్లి సాక్షిగా సాగిన ఆ సంవత్సరాల విద్య విద్యార్థులే ఒకరికొకరు చేదోడు వాదోడులో ఉండడం ప్రధాన పాత్ర పోషిస్తారు అని అనడానికి ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలే వారిలో మరింత మనోధైర్యాన్ని తీసుకువస్తాయని అనడంలో 1985వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో జరిగిన సన్నివేశాలే ఇటు ప్రజల్లో అలాగే ఇతర పూర్వ విద్యార్థుల్లో ఒక స్వచ్ఛమైన మార్పుకు శ్రీకారం జరిగేలా కనిపించింది. ఈ సమ్మేళనానికి స్థానికంగా ఉన్న విద్యార్థులు, శ్రీనివాస్ రెడ్డి ,ఫెర్టిలైజర్. ఆకుతోట మురళి, డాక్టర్ హబీబ్ ఖాన్, అంజద్ ఖాన్, గుడాల శ్రీనివాస్, గుజ్జేటి శ్రీనివాస్, పాత్రికేయుడు. కుక్కు సమ్మయ్య, రాజేష్ లు కార్యక్రమానికి విజయవంతం కొరకు కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు సాంబమూర్తి, హమీద్, శంకరయ్య, రాజేశ్వరరావు, సత్తయ్య అంకమ్మ, పాల్గొనడం జరిగింది. అలాగే పూర్వ విద్యార్థులు మురళి, మసూద్ ఖాన్ ,రమేష్ రెడ్డి, సమ్మయ్య,సెక్రటరీ. డాక్టర్ ఇంతియాజ్. ఎండి జామీర్, విజయేందర్ రావు,దాబిడే బాలాజీ, పూత వెంకట్ స్వామి రాజయ్య యాదవ్, ముజంమిల్ బేగ్,సునీత ,లక్ష్మి, సుశీల,లు పాల్గొనడం జరిగింది. ఈ సమ్మేళనానికి హాజరైన విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు విద్యార్థులు శాలువాతో సన్మానించడంతోపాటు మెమొంటోలను అందజేశారు.