అత్యంత వైభవంగా పూర్వ విద్యార్థుల కలయిక.

“నేటిధాత్రి”, హైదరాబాద్

నారాయగూడలోని కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో 52 సంవత్సరాల క్రితం చదువుకున్న పలువురు స్నేహితులు ఒక్కటిగా శనివారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
అనంతరం హైదరాబాదు బోట్స్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ పరిచయం, నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు తమ పిల్లలు ఏఏ హోదాల్లో స్థిరపడ్డారనే విషయాలను సహ విద్యార్థులకు తెలిపారు.
పాఠశాల పూర్వ విద్యార్థి సీనియర్ జర్నలిస్టు పి.వి.మదన్ మోహన్ మాట్లాడుతూ తాను ఏడు నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న రోజుల్లో నాడు అధ్యాపకులు చూపిన చొరవ విద్యార్థిగా మంచి నడవడికి దోహదపడినట్టు వివరించారు.
పాఠశాలను వీడి చాలా రోజలైనా పాఠశాల బాల్య మిత్రులతో పెనువేసుకొన్న బంధం వల్ల మళ్ళీ పూర్వ విద్యార్థులు కలువాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని గతంలో కొత్తకొండ,వంగరలో అతి కొద్ది మంది స్నేహితుతో నిర్వహించామని గుర్తు చేశారు.
శనివారంనాడు జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి యాభై మంది పూర్వ విద్యార్థులు హాజరవడం అభినందనీయమన్నారు.
కరీంనగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు కూడా కేశవ మెమోరియల్ తమ సహ విద్యార్థి అని తెలిపారు.
మరో పూర్వ విద్యార్థి మల్లారం గ్రామానికి చెందిన పూర్వ జర్నలిస్డు చాడా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను సమిష్టిగా కలిపేందుకు గత సంవత్సర కాలంగా ప్రయత్నాలు జరిగాయని
అందుబాటులో వున్న మిత్రుల ద్వారా సమాచారం సేకరించి వారిని ఒప్పించి ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవంతం చేశామని తెలిపారు.
హైదరాబాదుకు చెందిన పూర్వ విద్యార్థి లింగం మాట్లాడుతూ ఈ సమావేశంలో కలసిన పూర్వ విద్యార్థులు తాము అనేక రంగాలలో‌ స్థిరపడ్డారని తెలిపారు.
ఇక నుండి ప్రతి మూడు నెలలకు ఒక ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ కాకుండా యితర ప్రాంతాలలో నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గోన్న చిన్ననాటి మిత్రులు పాఠశాల రోజల్లో తాము చేసిన కొంటె పనులు,టీచర్లతో వున్న అనుబంధం… కొంటె చేష్టలను చేసిన వారిని ఏఏ టీచర్ ఏఏ విధంగా దండించే వాడో అనే పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు.
అదేవిధంగా అందుబాటులో వున్న నాటి టీచర్లకు వీడియో కాల్ చేసి పరిచాయాలు నిర్వహించకొని ఆశిస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో శంబు ప్రసాద్,విష్ణుదత్త,రమణారావు, వేణుమోహన్,సుబ్రహ్మణ్యం,
పట్నాయక్, రవీందర్ రెడ్డి,
నాగేంద్ర కుమార్,గోవర్ధన్,లక్ష్మీనారాయణ, యన్.వి.యన్ రావు,క్రిష్ణ, నర్సింహారావు పాల్గొన్నారు..
బాల్య స్నేహితుడు శశి సౌజన్యంతో ఈ కార్యక్రమం కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!