శిశు మందిర్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.2011-12 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయంగా ఒక్కచోట సమ్మేళనమయ్యారు.గత 12 ఏళ్ల క్రితం అందరూ ఒకే చోట చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉద్వేగ భరితంగా ఉత్సాహంతో కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి వారి కుటుంబ పరిస్థితులు,స్థిరపడిన రంగాలు,జీవితంలో సాధించిన విజయాలు తదితరులను ఒకరికొకరు చెప్పుకొని ఆనందం వ్యక్తం చేసుకున్నారు.అదేవిధంగా చదువుకున్న పాఠశాలను కలియ తిరుగుతూ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.ఈ సమ్మేళనంలో పాల్గొన్న గురువులకు నమస్కరిస్తూ గురుతర బాధ్యతగా వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. అలనాటి మధురస్మతులను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా,ఉత్సాహంగా పూర్వ విద్యార్థులు తమ గురువులతో గడిపారు.ఈ సమ్మేళన కార్యక్రమంలో అలనాటి గురువులు,శిశు మందిర్ ఆచార్యులు కిషన్ రావ్ (ప్రస్తుత ప్రముఖ జ్యోతిష్య పండితులు),శ్రీశైలం,గోవర్ధన్,
శివరామ్,రాములు,నర్సింహ్మరెడ్డి,మల్లయ్య,స్వరూప,పద్మ,అప్పటి విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.