
వనపర్తి నెటిధాత్రి :
వనపర్తి లో ప్రభుత్వ రాణీ లక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలలో పూర్వవిద్యార్థులు 1989 1991 బ్యాచ్ కు చెందిన వారు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఒకరికొకరు పలుకరించుకొని సంతోషాన్ని పంచుకున్నారు . ఈ సందర్భంగా జిల్లా వికలాంగుల సంఘం గౌరవ అధ్యక్షులు బీమ ప్రభాకర్ శెట్టి మాట్లాడుతూ వనపర్తి లో రాణీ లక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణో త్సవాల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు . డిగ్రీ కళాశాల మిత్ర బృందం ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తోట బాలరాజ్ పుట్ట ఆంజనేయులు అశోక్ శ్రీదేవి ఉన్నారు