గురువు ను సన్మానిస్తున్న పూర్వ శిష్యుడు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రెండు దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ…
ఆటపాటలతో అలరించారు.
వేములవాడ
వేములవాడ పట్టణంలోని గీతా విద్యాలయంలో గత రెండు దశాబ్దాల క్రితం పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు బుధవారం పట్టణంలోని మంజునాథ కళ్యాణమండపంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. 2004- 2005 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు 20 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆత్మీయతను పంచుకున్నారు. ముందుగా తమ కు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు తాము సాధించిన విజయాలు, అపజయాలు, సాధక, బాధకాలను వేదికపై పంచుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో అలరించారు. రెండు దశాబ్దాల క్రితం పాఠశాలలో విడిచి వెళ్లిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆలింగణం చేసుకొని కన్నీటి పర్యంతరమై ఆనందభాష్పాలను వేదికపై విడిచి వెళుతూ మళ్లీ కలుద్దాం అంటూ బై బై చెప్పుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వేములవాడ కౌన్సిలర్ లునిమ్మచెట్టి విజయ్, గోలీ మహేష్, చల్మెడ పీఏ కే వి మహేష్ రెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్, దేవేందర్, శశికాంత్, రజిత, అమ్మాయి, రమేష్, ప్రసాద్, సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.