మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు
కారేపల్లి నేటి ధాత్రి
దశాబ్దాల పోరాటం వందలాదిమంది త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళి కార్యక్రమంలో పాల్గొంటూనే ప్రజల దైనందిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై సమరానికి తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు స్థానిక కారేపల్లి మండల కేంద్రంలో జరిగిన కారేపల్లి కామేపల్లి సంయుక్త మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ దశాబ్దం కాలం పాటు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం చూపటంలో విఫలం చెందారని అందువల్లే గడిచిన ఎన్నికల్లో కెసిఆర్ ను ప్రజలు బుద్ధి చెప్పారు అలానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తో కాలం గడపకుండా ఇచ్చిన ఆరు హామీలను అమలకు పూనుకోవాలని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు తాగునీరు అందించేందుకు కృషి చేయాలని బయ్యారం ఉక్కు పరిశ్రమ నెలకొల్పి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని అలానే ఆంధ్రలో కలిసిన ఆడు పంచాయతీలు తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని ఆయన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతన్న కు కావలసిన అన్ని రకాల సౌకర్యాలని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అధికారులు ప్రయత్నించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ మండల కార్యదర్శిలు గుమ్మడి సందీప్ ఎన్వి రాకేష్ డివిజన్ నాయకులు గుగులోత్ తేజ నాయక్ మండల నాయకులు భాస్కర్ సత్తిరెడ్డి సక్రు బాలు అనసూర్య సరోజినీ రంగ్య రాజు పాల్గొన్నారు.