బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష
ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్
సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో ఈరోజు
సిరిసిల్ల నేటి ధాత్రి:
బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

అనంతరం మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృప, కటాక్షం సుఖ:సంతోషాలతో ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కే.టీ.ఆర్ కోరాతు, స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తూ, అనంతరం హనుమాన్ దీక్ష స్వాములతో బిక్ష కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.