https://epaper.netidhatri.com/view/347/netidhathri-e-paper-13th-aug-2024
వారి మెడపట్టి గెంటగలరా!!
`సిఎం వచ్చే లోపు పూర్తి చేసుకోండి!?
`రోహౌజ్‌ల స్థానంలో అప్పార్టుమెంట్లు కడితే మూడు వేల మందికి నివాసం.
`అసలు రోహజ్‌ల నిర్మాణమే నేరం!
`రోహౌజ్‌లకు స్థలాల కేటాయింపులే అక్రమం!
`250 మంది సినీ గద్దలకు 14 ఎకరాలు కేటాయింపు దుర్మార్గం.
`గత పాలకులకు, హమీ ఇచ్చిన పాలకులకు తేడా కనిపించడం లేదంటున్నారు.
`సీిఎం. స్పందించి కార్మికులకు న్యాయం జరిగితేనే ప్రజా పాలనకు పేరు.
`చిత్రపురిలో 1536 ఎస్‌ఎఫ్‌టికి మించి ఇల్లు నిర్మించవద్దు!
`అప్పార్టు నిర్మాణాలు తప్ప ప్రత్యేకంగా ఇండ్ల నిర్మాణానికి ఆస్కారమే లేదు!
`రోహౌజ్‌ల యాజమానులకు అధికారుల బాసట.
`కోట్లు చేతులు మారినట్లు వినిపిస్తున్న ఆరోపణ?
`అందుకే అధికారులు దగ్గరుండి అందిస్తున్న సహకారం!
`తప్పు చేస్తున్నామనే భావన లేదు!
`తర్వాత ఇబ్బంది పడతామన్న భయం లేదు.
`లంచాలకు తెగబడి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు.
`పెద్ద వారికి కొమ్ము కాస్తున్నారు.
`ఓట్లు వేసి గెలిపించేది పేదలు.
`పాలకుల పంచన చేరి లబ్ధి పొందేది పెద్దలు.
`ఎప్పుడైనా, ఎక్కడైనా పేదలే సమిదలు.
`జీవితాంతం పేదలకే కష్టాలు.
`కార్మికుల కలను తుంచి పెద్ద వాళ్లు దూరి ఆవాసం.
`కార్మికులకు న్యాయం చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో అంశం.
`ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇచ్చిన వాగ్దానం.
`సిఎం హామీ బేఖాతరు చేస్తున్న అధికార గణం.
`అందుకే సిఎం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చేలోపు.. హడావుడిగా రోహౌజ్‌ల నిర్మాణం.
`రోహౌజ్‌ల నిర్మాణాలు కొన్ని గతంలో కూల్చేశారు.
`ఇప్పుడు వాటికి మళ్ళీ మరమ్మత్తులు చేస్తున్నారు.
`లక్షలు తీసుకొని అధికారులు సహకరిస్తున్నారు.
`అందరి దగ్గర కలిపి కోట్లు దిగమింగారు.
`అందుకే హడావుడి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు!
`అమెరికా పర్యాటక ముగించుకొని సిఎం వచ్చే లోపు పూర్తి చేయాలని చూస్తున్నారు.
`నాకు రెండు కావాలని ఓ మంత్రి అన్నట్లు వార్తలొచ్చాయి?
`ఆ మంత్రి స్పందించిన సందర్భం లేదు.
`మంత్రి అండతోనే నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు వినిపిస్తున్న విమర్శలు.
`కార్మికులకు న్యాయం చేయాల్సిన మంత్రే సినీ పెద్దలకు కొమ్ము కాయడం విడ్డూరం!
హైదరాబాద్,నేటిధాత్రి:
అన్యాయం అనేది ఎక్కడైనా అన్యాయమే…అక్రమం అన్నది ఎప్పుడైనా అక్రమమే అని అనుకుంటాం. కాని వాటికీ మినహాయింపులు కొన్ని సార్లు కనిపిస్తుంటాయి. చట్టం చుట్టమైనప్పుడు కొంత మంది ఎన్ని అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసిన అవి కనిపించవు. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే అవకాశాలుండవు. అక్షరాల ఇక్కడ ఇదే జరగుతోంది. నలభై సంవత్సరాల నిరీక్షణను కూడా సమాధి చేస్తున్నారు. పేదలను తీవ్ర అన్యాయాలకు గురి చేస్తున్నారు. చిత్ర పురిలో ఇది యదేఛ్చగా జరుగుతోంది. కార్మికులు నెత్తి నోరు మొత్తుకొని చెబుతున్నారు. కాని వారి ఆవేదన వింటున్నవారు లేరు. విన్నా చూద్దాం, చేద్దాం అని చేతులు దులుపుకుంటున్నారు. దాంతో రెండు దశాబ్దాలుగా సినీ కార్మికులు గూడు లేక, గుండె చెదిరిపోతోంది. వారి కల కలగానే మిగిలిపోతోంది. వారి కళ్లముందే వారి భూమిలో ఇతరులు ఇండ్లు కట్టుకుంటుంటే చూస్తూ వుండిపోవాల్సివస్తోంది. ఏ నాయకుడినైనా వారి కన్నీళ్లతో మాత్రమే కాళ్లు కడగగలరు. ఏ అధికారికైనా రెండు చేతులెత్తి మొక్కగలరు. లేకుంటే కాళ్లు పట్టుకొని కన్నీటి పర్యంతమౌతారు. అంతకంటే ఏమీ చేయలని అభాగ్యుంటే అందరికీ చులకనే…అందుకే చిత్రపురిలో పెద్దలు తమకు తామే రెడ్ కార్పెట్ వేసుకున్నారు. చిత్రపులో ఓ 14 ఎకరాలు స్వాదీనం చేసుకున్నారు. సొసైటీని గుప్పిట్లో పెట్టుకొని ఎవరికి వారు ఆ పద్నాలుగు ఎకరాలు పంచుకున్నారు. రోహౌజ్‌లు నిర్మించుకున్నారు. కార్మికుల కోసం ఓ మహానుబావుడి త్యాగం వృధా చేస్తున్నారు. ఆ వ్యక్తి ఆశయాన్ని గంగలో కలుపుతున్నారు. ఎందుకంటే కార్మికులకు కేటాయించాల్సిన భూమిని సినీ గద్దలకు అప్పగించడం అన్నది ఎవరికీ అక్రమంగా కనిపించడం లేదు. కార్మికులకు చెందాల్సిన భూమి పిడికెడు మంది గద్దలు పంచుకుంటుంటే అన్యాయం అనిపించడం లేదు. కార్మికుల కల తుంచేస్తే కూడా అది ఎవరికీ తప్పనించడం లేదు. ఇక్కడ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో వున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే పట్టుదలగా వున్నారు. దాంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అనేకసార్లు చిత్రపురిపై చర్చ జరిగింది. ఆ సమయంలో కార్మికుల పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగైనా వారికి న్యాయం చేయాలన్న సంకల్పంతోనే వున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన ఈ ఎనమిది నెలల సమయంలో ఆయన అటు పాలనాపరమైన విషయాల్లోనూ, ఎన్నికల వ్యవహారాలలో కొంత బిజీబిజీగా వుండాల్సివచ్చింది. కొన్ని విషయాలపై పూర్తి దృష్టిపెట్టే అవకాశం లేకపోయింది. కాని చిత్రపురి విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎలాంటి షశబిషలు లేవు. అయితే ముఖ్యమంత్రి గత కొంత కాలంగా పాలనాపరమైన అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాల్సిరావడంతో చిత్రపురి కథ ఆయన ముందుకు పూర్తిగా రాలేదు. ఇదే సమయంలో ఆయన తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పార్యటనకు వెళ్లారు. ఇదే అదునుగా చిత్రపురి పెద్దలు తమ పన్నాగం మొదలు పెట్టారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికే పనులు మొదలై, దాదాపు పూర్తి దశకు చేరుకున్న రోహౌజ్‌లును పూర్తి చేసే పనిలో పడ్డారు. అందుకు జిహెచ్‌ఎంసి అదికారుల పూర్తిగా సహకరిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే జిహెచ్‌ఎంసి అధికారులే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. అందుకు అదికారులకు పెద్ద మొత్తంలోనే ముడుపులు ముట్టినట్లు సమాచారం అందుతోంది. పూర్తి కావాల్సిన ఒక్కొ రోహౌజ్‌కు లక్షల్లో వసూలు చేసి, భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. దాంతో గత పది రోజులుగా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. చకచకా నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. గతంలో కూల్చివేతలు జరిగిన రో హౌజ్‌ల మరమ్మతులు దాదాపు పూర్తి చేస్తున్నారు. ఈ విషయంపై వివరాలు అందించేందుకు మాత్రం అదికారులు ముందుకు రావడం లేదు.
అసలు కార్మికులకు కేటాయించిన ఈ చిత్ర పురిలో కేవలం అప్పార్టుమెంట్ల నిర్మాణం మాత్రమే జరగాలి.
కార్మికులలోనే కలిసి వుండాలనుకునే పెద్దలకైనా సరే అప్పార్టుమెంటులోనే ఫ్లాట్ ఇవ్వాలి. అందులోనే కొనుగోలు చేసుకోవాలి. అంతే తప్ప ప్రత్యేకంగా ఎవరికీ విల్లాల మించిన రోహౌజ్‌ల నిర్మాణం అన్నది చేపట్టేందుకు వీలు లేదు. అందుకే ఆ నిర్మాణాలన్నీ ప్రభుత్వాదేశాలకు వ్యతిరేకమని కూల్చివేతలు మొదలు పెట్టారు. ఇంతలో ఎన్నికల సమయం రావడంతో కూల్చివేతలు ఆపారు. దాన్ని కూడా కొంత మంది సినీ గద్దలు అనుకూలంగా మార్చుకొని రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో తమకు అన్యాయం జరుగుతున్న సంగతిని కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కార్మికులకు భూమి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఎన్నికల ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చిత్ర పురి కార్మికుల సమస్యను చేర్చారు. తప్పకుండా వారికి న్యాయం చేస్తామని మాటిచ్చారు. అయితే ఎనమిది నెలలైనా చిత్రపురి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. దాంతో చిత్రపురి గద్దలు మళ్లీ రోహౌజ్‌ల నిర్మాణం యదేచ్చగా సాగిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలోని అనేక ప్రాంతాలలో అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రజలు కొనుగోలు చేసుకొని నిర్మాణాలు చేసుకొని, ఏళ్ల తరబడి నివాసం వుంటున్న ఇండ్లను ఇప్పుడు అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నారు. కాని కళ్లముందు అక్రమ నిర్మాణాలు చిత్ర పురిలో కడుతుంటే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇదేం పక్ష పాత దోరణి అని నిలదీస్తున్నారు. పేదలు చిన్న గుడెసె కట్టుకుంటే కూల్చేస్తారు. కాని పెద్దలు అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నా, ఎందుకు అధికారులు సహకరిస్తున్నారన్నదానిపై ఇటీవల ఒక పెద్ద వార్త సంచలనంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తున్న సంబంధిత మంత్రి నాకు రెండు రోహౌజ్‌లు కావాలని అన్నట్లు పెద్దఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
అయితే అది నిజమా? కాదా? అన్నది అటు చిత్ర పురి పెద్దలు చెప్పలేరు. సంబంధిత మంత్రి అబద్దమని ఖండిరచింది లేదు. కార్మికులకు న్యాయం చేయాల్సిన స్ధానంలో వున్న వాళ్లే నాకు రెండు రోహౌజ్‌లు కావాలని అంటే బాధితులకు న్యాయం జరుగుతుందా? జిహెచ్‌ఎంసి పరిధిలో ఏ ఎన్నికలైనా సరే కనీసం 37శాతం కూడా పోలింగ్ నమోదు కావడం లేదు. అంటే నగరంలో పెద్దలు ఎవరూ పోలింగ్ కేంద్రానికి రారు. ఓటు వేయరు. కాని పేదలే పార్టీలకు ఓట్లేస్తాయి. గెలిపిస్తాయి. మరి అలా గెలిచిన పార్టీలు పేదలకు న్యాయం చేయాల్సిపోయి, పెద్దలకు కొమ్ము కాస్తుంటారు. ఇదే ఎప్పుడూ జరుగుతోంది. ఇప్పుడు అదే జరిగింది. పాలకపక్షం పంచన సినీ పెద్దలు చేరి కార్మికులకు అన్యాయం ఎప్పుడూ చేస్తూనే వున్నారు. ఇప్పుడైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన కార్మికులకు ఓ మంత్రే నాకు రెండు హౌజ్‌లు కావాలన్నాడంటే ఇక కార్మికులకు న్యాయం జరుగుతుందా? సినీ పెద్దలెవరైనా సరే వారి సంపాదనతో నగరంలో ఎక్కడైనా సులువుగా స్ధలాలు కొనుగోలు చేసుకునేంత స్ధోమత వుంది. కాని అతి చౌకగా వచ్చే చిత్రపురిని ఎందుకు వదిలేయాలని కాజేశారు. కార్మికులకే చోటు దక్కకుండా చేశారు. ఇక మంత్రి స్ధాయిలో వున్న నాయకుడు ఎక్కడంటే అక్కడ స్ధలాలు కొనుక్కునే శక్తి వున్నవారు. వాళ్లు కూడ మాకు చిత్రపురిలో రోహౌజ్‌లు కావలనుకోవడం వెనుక మతలబు ఏమిటో ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. అందువల్ల కార్మికులకు న్యాయం జరిగే అడుగులు పడితే, సదరు మంత్రి మీద వచ్చిన వార్తలు అవాస్తమని తేలుతుంది. లేకుంటే అదే నిజమని నమ్మే అవకాశం వుంది. ప్రభుత్వమే స్పందించాలి. రోహౌజ్‌లకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. మొత్తం మీద కార్మికులను న్యాయం జరగాలి.