ప్రభుత్వాలు ఏదైనా ప్రశ్నించేది ఏఐటీయూసీనే
ఏఐటియుసి అధ్యక్ష,కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
ఇతర సంఘాలు గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ పై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, కార్మికుల పక్షాన ప్రభుత్వాలు ఏదైనా ప్రశ్నించేది ఏఐటీయూసీ మాత్రమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి లు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమారులు అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే1 ఇంక్లైన్లో వాసిరెడ్డి సీతారామయ్య, కేటీకే ఫై ఇంక్లైన్లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీలు సదయ్య, దోర్నాల తిరుపతి అధ్యక్షతన ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్లలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణి లాభాల వాటపై ఇతర సంఘాలు గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ పై ఉనికి కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీలలో దేశంలో ఎక్కడలేని విధంగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కేఎల్ మహేంద్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి లాభాల వాటా ఇప్పించిన ఘనత కేవలం ఏఐటియుసి సంఘానికే దక్కుతుందని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం రాజకీయ జోక్యంతో పైరవులకే పరిమితమయ్యారని, ఎలాంటి స్ట్రక్చర్ మీటింగ్లో జరగకుండా పది సంవత్సరాలు కార్మికులకు చేసింది శూన్యమని ఆరోపించారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘం పోరాట ఫలితంగానే 32 శాతం ఉన్న లాభాల వాటాను 33% ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ లాభాల వాటాను వచ్చే నెల 7న దసరా ముందు నేరుగా కార్మికుల ఖాతాలలో లాభాల వాట జమ చేయబడతాయని అన్నారు. ప్రభుత్వం యాజమాన్యంతో మాట్లాడి పారదర్శకంగా లాభాల వాటాను పంచడం జరిగిందని వివరించారు. అట్లాగే వరద బాధితుల సహాయార్థం యాజమాన్యం డబ్బుల నుండే సహాయం అందజేయడం జరిగిందన్నారు. కార్మికుల ఖాతాల్లో నుండి కాకుండా ప్రభుత్వంతో మాట్లాడి నేరుగా సింగరేణి నిధులనుండే వరద సాయం ఇప్పించామని తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు సంఘం గా గెలిచిన 8 నెలలు గుర్తింపు పత్రం ఇవ్వకుండా యాజమాన్యం కాలయాపన చేసిందని ప్రభుత్వాన్ని మెడలు వంచి గుర్తింపు పత్రం ఇప్పించుకోవడం జరిగిందని కార్మిక సమస్యలను పరిష్కరించడం కోసం త్వరలోనే స్ట్రక్చర్ మీటింగ్ లు ఏర్పాటుచేసి పెండింగ్లో ఉన్న అనేక కార్మిక సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వారు అన్నారు. త్వరలోనే కంపెనీలో వచ్చే దీపావళి బోనస్ పై త్వరలోనే మీటింగ్ ఉంటుందని మెరుగైన బోనస్ కోసం ప్రయత్నిస్తామని అన్నారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తామని, మారు పేర్లు త్వరలోనే స్పష్టమైన ప్రకటన ఇప్పించే విధంగా చర్యలు చేస్తామని, కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి హామీని నెరవేర్చే దిశగా యాజమాన్యంతో పోరాడుతామని పేర్కొన్నారు. ఇతర సంఘాలు చేస్తున్న అర్థం లేని ఆరోపణలు కార్మికులు గ్రహించాలని, భవిష్యత్తులో సింగరేణి అభివృద్ధి, రక్షణకు కార్మిక సమస్యల పరిష్కారానికి చేసే ప్రతి పోరాటంలో కార్మికులు ఏఐటీయూసీకి అండగా నిలవాలని సీతారామయ్య, రాజ్ కుమార్ లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేటికే వన్ ఇంక్లైన్లో అసిస్టెంట్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి లు జి శ్రీనివాస్ గురుజపెల్లి సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ కమిటీ నాయకులు నూకల చంద్రమౌళి, కేటీకే 5 ఇంక్లైన్లో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఆసిఫ్ పాషా, రాజేందర్, నాగేందర్ బాబు కుమారస్వామి,
బ్రాంచ్ నాయకులు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు,షిఫ్ట్ ఇన్చార్జిలు సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.