అల్లరి నరేశ్ ఆల్కహాల్…
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో…
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆల్కహాల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగా, అల్లరి నరేశ్ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.