వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు,సామాజిక వేత్త
అల్లం బాలకిషోర్ రెడ్డి ఒక పేద కుటుంబానికి అండగా నిలిచారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గీసుకొండ మండల కేంద్రానికి చెందిన యాదగిరి అశోక్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.ఆ పేద వారి పరిస్థితిని చూసి చలించిన అల్లం బాలకిషోర్ రెడ్డి నేనున్నా అంటూ ఆపద్బాంధవుడిగా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
కందికొండ రాజు కందికొండ,రాజకుమార్, లంబాడి మహేందర్, ఎనపోతుల కమలాకర్, తోట కమలాకర్, చాడ ప్రభాకర్ రెడ్డి, చాడ శ్రీనివాసరెడ్డి,వేణు, వీరాటి మాధవరెడ్డి, నాగేల్లి రమేష్, ఎంజాల అశోక్, ఎండి అప్రోచ్, కోట కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.