
-మహా జాతరకు భారీ గా బయలుదేరిన భక్తులు
#నెక్కొండ, నేటి ధాత్రి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుండి ఈనెల 25వ తేదీకు వరకు నాలుగు రోజులపాటు జాతర జరుగుతుండడంతో మొదటి రోజు జంపన్న మేడారం గద్దెపై రంగ ప్రవేశం చేయగా రెండవ రోజు సారలమ్మ మూడవరోజు సమ్మక్క మేడారం గద్దలపై కొలువు తేరి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ వనదేవతలను కొలుచుకునేందుకు నెక్కొండ మండల వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రజలు ఎడ్లబండ్లు ట్రాక్టర్లు టాటా ఏసీలు పలు రకాల వాహనాల సహాయంతో వెళ్లి వనదేవతలను పిల్లాపాపలతో కలిసి దర్శించుకుని వనదేవతల అనుగ్రహం పొందాలని ముక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది. మేడారం సమ్మక్క సారక్క జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తల్లిదండ్రులతో జనంతో కలకల్లాడే పల్లెలు బోసిపోయినాయి.