వనపర్తి నేటిదాత్రి ;
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పాఠశాలల్లో అన్ని వసతులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం పానగల్ మండల పరిధిలోని దావాజీ పల్లి, దొండాయి పల్లి, రాయిని పల్లి గ్రామాల్లో సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశిలిలించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేపట్టిన మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలు వేగవంతంగా పూర్తి చేయడమే కాకుండ నాణ్యతతో కూడిన పనులు జరగాలని ఆదేశించారు.
తాగునీటి వసతి, వంట గది, మరుగుదొడ్లు సహా చిన్న చిన్న మరమ్మతుల పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
దావాజీ పల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. గుడ్లు, పాలు సరుకుల నిల్వలను పరిశీలించారు.
జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిబాయి, ఎంపీడిఓ కోటేశ్వర్, ఎంపీఓ రఘురామ్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, పంచాయతి కార్యదర్శి శ్రీకాంత్, ఏపీఓ కురుమయ్య, ఇంజనీరింగ్ అధికారుల లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
పాఠశాలలు ప్రారంభo నాటికిఅన్ని వసతులు సిద్దం కావాలి కలెక్టర్
