ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల
సమీక్ష సమావేశం
కార్పొరేటర్ బన్నాల
ఉప్పల్ నేటిధాత్రి జూలై 31:
బోనాల పండుగను పురస్కరించుకొని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం: కార్పొరేటర్
ఉప్పల్ బోనాల పండుగను పురస్కరించుకొని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ జిహెచ్ఎంసి వివిధ శాఖల అధికారులతో కార్పొరేటర్ క్యాంప కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష సమావేశంలో అన్ని విభాగాల అధికారులతో మాట్లాడుతూ బోనాల పండుగకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు రోడ్ల పైన గుంటలు లేకుండా బీటీ పేచులు వేయాలని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు అన్ని ఆలయాల వద్ద ప్లాస్టిక్ కవర్లు ఇవ్వాలని, బ్లీచింగ్ పౌడర్ ను చల్లి గుడి పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, ఎంటమాలజీ విభాగం వారు గుడి పరిసర ప్రాంతాల్లో స్ప్రేయింగ్ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది, అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగం అధికారులు ప్రజలకు మంచినీళ్ల లోటు లేకుండా సమయానుసారం మంచినీళ్లు సరఫరా చేయాలని ఆలయాలకు వెళ్లేదారిలో ఎటువంటి లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆలయాలకు వెళ్లే దారిలో చెట్ల కొమ్మలను గుర్తించి పండగలోపు తొలగించాలని ఆదేశించడం జరిగింది.
కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం రజనీకాంత్ రెడ్డి, ఏఈ రవీందర్ రెడ్డి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏ.ఈ రాజ్ కుమార్, శానిటేషన్ విభాగం డి ఈ చందన, శానిటేషన్ సూపర్వైజర్ రాజేశ్వర్ రెడ్డి, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఏఈ నరేష్ రెడ్డి, మరియు వారి సిబ్బంది అజయ్, శేఖర్, బాలు, కేదార్, అధికారులు పాల్గొన్నారు.