
MLA Amar
అన్ని విధాలా గ్రామాల అభివృద్ధి
ఉపాధి హామీతో మెండైన అవకాశాలు
నియోజకవర్గంలో 63 లక్షలతో 187 పశువుల తొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్
పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 01:
గ్రామాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని కీలపల్లి పంచాయతీ జే.ఆర్. కొత్తపల్లిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణ భూమీ పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పూజలు చేసి పనులను ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో 62 లక్షల రూపాయలతో 187 నీటి తొట్టెలను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకంలో రైతులకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని గ్రామాలలో రోడ్లు, మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ రవికుమార్, అసిస్టెంట్ పిడి ఎస్ రవికుమార్, ఎంపీడీవో సురేష్ కుమార్, తహసిల్దార్ మాధవరాజు, ఏపీవో శ్రీనివాసులు, ఏపీఎం హరినాథ్ లతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాపరెడ్డి,నాగరాజు రెడ్డి, ఆల్ కుప్పం రాజన్న, మునస్వామి రెడ్డి, గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు..