ప్రజలంతా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

రామకృష్ణాపూర్, మార్చి 26, నేటిధాత్రి:

రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. మంగళవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం ఏరియా నుండి అంగడి బజార్, సూపర్ బజార్, రాజీవ్ చౌక్ వరకు కేంద్ర బలగాలతో కలిపి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ…. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పోలీస్ శాఖ వారి నియమ నిబంధనలు పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పోలీసులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్,ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్,100 మంది కేంద్ర బలగాలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *