
కారేపల్లి నేటి ధాత్రి
కారేపల్లి మండల కేంద్రంలో బంద్ ను విజయవంతం నిర్వహించిన వామపక్షాలు
దేశంలో వివిధ కేంద్ర స్కీములలో పనిచేస్తున్న సుమారు కోటి మంది పనిచేస్తున్న స్కీము వర్కర్లను ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెగ్యురేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర స్కీం లకు కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టిందని,ఐఎస్ఓ తీర్మానం ప్రకారం వీరిని కార్మికులుగా గుర్తించడం, కనీస వేతనాలు చెల్లించడం, పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనన్నారు. వీటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన తెలియజేశారు. ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తున్నదన్నారు. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం వాటాలు తెగనమ్ముతున్నదని,నేషనల్ మానిటైజేషన్ పైడ్లైన్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తున్నదన్నారు. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్ఫూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నదని, సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నదన్నారు. కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎలసి వాటాలను అమ్మేందుకు తెగబడిందఙ్, కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్థిక స్వావలంబనకే ముప్పు తెస్తున్నాయన్నారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4. లేబర్ కోడ్లను తెచ్చిందని,కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి వలికి, సమ్మె హక్కును కాలరాస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తూ,తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తేవడానికి, కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నదన్నారు. కనీస వేతనం నెలకు రూ.26,000/-లు నిర్ణయించేందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించటం లేదని,కోట్లాది మంది కార్మికులకు వర్తించే ఇసిఎస్ పెన్షన్ నెలకు రూ.10,000/-లకు పెంపు, సిపిఎన్ను రద్దు చేసి, పాత పెన్షన్ (ఓపిఎస్)ను పునరుద్ధరణను వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ తో పాటు రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడి ఉద్యోగులకు 18 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ కు తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ఉద్యోగుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు.కారేపల్లి మండల కేంద్రంలో బంద్ నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కారేపల్లి ఎస్ఐ పుష్పాల రామారావు పోలీసు సిబ్బందితో వారిని స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో అఖిల పక్షం.సిపిఎం జిల్లా నాయకులు భూక్యా వీరభద్రం కోండెబోయిన నాగేశ్వరరావు సీతా మహాలక్ష్మి మండల నాయకులు నరేంద్ర సీఐటీయూసి కార్మిక సంఘాలు పంచాయతీ సిబ్బంది బోళ్ళ కొమురయ్య ఆదేర్ల శ్రీను ఆదేర్ల గౌతమ్ అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఐప్ టియు ప్రకాశ్ శ్రీనివాస్ రెడ్డి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంధా తేజనాయక్ .సిపిఐ ఏఐటీయూసీ బోళ్ళ రామస్వామి చెరుకూరి నర్సయ్య తుర్క మల్లేష్ సుధాకర్ చింతల హనుమంతు కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి చంద్ర ప్రకాశ్ పోలగాని శ్రీను గడ్డం వెంకటేశ్వర్లు భద్రు నాయక్ మరియు అన్ని సంఘాలు ఆటోయూనియన్స్ రైతు కూలీ సంఘం కార్మిక సంఘాల నాయకులు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.