కొల్చారం (మెదక్) నేటిధాత్రి:-
కొల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలలో అన్ని గ్రామాలలో క్రైస్తవులు ఏసుక్రీస్తు పాటలు పాడుకుంటూ, వాక్య ధ్యానాన్ని ధ్యానించి, శాంతి కరుణ కృపాలతో , ప్రత్యేక ఆరాధన క్రమములు బోధించి, క్రైస్తవ సోదరీ సోదరీమణులు, ఏసుక్రీస్తు పాపుల కొరకు సిలువపై మరణించిన ఏడు మాటలను ధ్యానించి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. ప్రజల రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఏసుక్రీస్తును క్రైస్తవ మత పెద్దలందరూ శుక్రవారం రోజున ఉపవాస దీక్షలు చేసి ఏసుక్రీస్తు సంతాప దినంగా భావించుకున్నారు. ఏసుక్రీస్తుకు సిలువ వేయబడిన తిరిగి మూడవ రోజున పునరుత్థాన దినాన్ని ఆదివారం రోజున ఈస్టర్ పండుగ జరుపుకుంటారు.