ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఝరాసంగం మండల ఆయా గ్రామలలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు: నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలియజేస్తూ హైదరాబాద్లో జరిగే ఈనెల 19న బహిరంగ ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్ కోరారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు సయ్యద్ మజీద్ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ దారు సలాం లో జరిగే ఈ నిరసన సభను విజయవంతం చెయ్యాలని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.