చేనేత కార్మికులు అందరూ హాజరు కావాలి

శాయంపేట, నేటి ధాత్రి:

చేనేత ఐక్యవేదిక తెలంగాణ కార్యవర్గం సోమవారం రోజున శాయంపేట చేనేత సహకార సంఘాన్ని సందర్శించనున్నట్లు చేనేత మాజీ అధ్యక్షులు బాసని చంద్రప్రకాష్ తెలిపారు. సంఘం సభ్యులు, పద్మశాలీలు హాజరుకావాలని కోరారు. సంఘం సమస్యలు, కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఈజీఎస్ ద్వారా సభ్యులకు పని కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సంఘంలో పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!