
కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలి
రేడియో గ్రాఫర్ రాసమళ్ళ కృష్ణ
సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందజేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
పరకాల నేటిధాత్రి
కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలని ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రేడియో గ్రాఫర్ రాచమల్ల కృష్ణ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ పర్మినెంట్ చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కనీస వేతనం 26000 తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గతంలో ప్రభుత్వం ఔట్సోర్సింగ్,కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వమే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీపై ప్రభుత్వం ఏమీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.వెంటనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను తొలగించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 5 నెలలకు ఒకసారి జీతాలు పడుతున్నాయని పూట గడవటమే గండం గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.5 నెలలకు ఒక నెల జీతం మాత్రమే వేస్తూ మిగితా నెలల జీతం ఆపుతున్నారని కొన్ని ఆసుపత్రులలో పీఎఫ్ లు కూడా సరిగా వేయడం లేదన్నారు.కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి ఇప్పటివరకు పిఎఫ్ నంబర్ లు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.ఈ కార్యక్రమంలో విష్ణుమూర్తి, సునంద,విజయలక్ష్మి, కరుణాకర్,రమేష్,నాగమణి, పద్మ, కవిత,సంధ్యారాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.