మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్
హన్మకొండ :పల్లె పల్లె కు మెపా పయనం” లో భాగంగా శనివారం సంగెం మండలం,నల్లబెల్లి గ్రామంలో గ్రామ మత్స్య శాఖ ఛైర్మెన్ నీరటి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మెపా తెలంగాణ (ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ )రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు తమ మ్యానిఫెస్టోలో లో చేర్చిన ముదిరాజ్ ల రిజర్వేషన్ అంశం ను పరిష్కరించాలని, లేనిచో అన్ని ముదిరాజ్ సంఘాలు ఐక్య ఉద్యమాలు చేస్తారని అన్నారు.మేము ఎంతో మాకు అంత వాటా ఇవ్వాలని, అనంతరం రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో ముదిరాజ్ లు తమ సత్తా చాటాలని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.అనంతరం ముదిరాజ్ లు అందరూ ముక్త కంఠం తో ఐక్య నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో నీరటి సూరయ్య, సారంగం, సమ్మయ్య,సంపత్,ఐలయ్య, రాజు, సుధాకర్,యెడ ఎల్లయ్య,సతీష్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.