డిజె సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం * *రాత్రి పది గంటలలోపు నిమర్జనం పూర్తిచేయాలి
శాయంపేట నేటి ధాత్రి:.
శాయంపేట మండల కేంద్రంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి రేపు నిమజ్జనంకు వెళుతున్న క్రమంలో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవంనిర్వహించుకోవాలని తెలియపరిచారు డీజేసౌండ్ సిస్టం వినియోగించినటువంటి వారిపై కేసు నమోదు చేసి సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం, ఎవరైనా నిమర్జనం ఉత్సవాలలో సౌండ్ సిస్టం వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొని, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నిమజ్జన సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా,
విగ్రహాలను వీలైనంత తొందరగా నిమజ్జనం కొరకు చెరువు వద్దకు తీసుకొని వెళ్ళగలరు. నిమర్జనం ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే డయల్ -100,లోకల్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందజేయగలరు. కావున ప్రజలందరూ గణపతి నిమర్జన ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలోరాత్రి పది గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని కోరడమైనది.