ఇంటర్ ఫలితాలలో అల్ఫోర్స్ ప్రభంజనం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బుర్ర.తేజశ్రీ 463 /470, జి.గౌతమి 456/470, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో శ్రావ్య 992/1000, దీపిక 992/1000, నిక్షిప్త 990/1000, రశ్మిత 988/1000, అనన్య 986/1000 మార్కులు సాధించారు.

ఈసందర్భంగా కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.