
రామడుగు, నేటిధాత్రి:
షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల7వ తేదీన కరీంనగర్ లో నిర్వహించిన జిల్లాస్థాయి షూటింగ్ బాల్ అండర్16 విభాగంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్పోర్స్ పాఠశాలలకు చెందిన వి.వంశీక, ఆర్.సంహిత, కె.సృజన, బి.శ్రీహర్ష, సిహెచ్.కార్తీక్, కె.సుశాంత్ తోమ్మిదవ తరగతికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఈనెల18న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీలకు పాల్గొనడం జరుగుతుంది. ఈసందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు