అమరావతి.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కు ఓ ఎస్ డి గా మార్కాపురం పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈయన గతంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో చింతూరు ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేసారు. ఆ సమయంలో అక్కడ గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారు. అనంతరం కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ కు ఆర్డీవో గా సమర్థవంతంగా పనిచేసి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజల ప్రశంసలు పొందారు.
ఆకుల వెంకటరమణ ఉమ్మడి రాష్ట్రంలో నాడు జరిగిన గ్రూప్ 1 పోటి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించి యువతి, యువకులకు మార్గదర్శకంగా నిలిచారు.