హైదరాబాద్, నేటి ధాత్రి:
మంగళవారం రోజున హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ అనే విద్యార్థి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి రావడంతో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగిందని, ఇకముందు కూడా మాకు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడు కూడా అక్షిత ఫౌండేషన్ ముందుంటుందని చైర్మన్ సన్నీ కుమార్ రాపాక తెలిపారు.