నిజామాబాద్, నేటి ధాత్రి:
నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్డు పక్కన నివసించే వృద్ధులకు పెద్దలకు వికలాంగులకు వాళ్ళ చేంతకే అన్నపానీయాలను తీసుకెళ్లి ఇవ్వడం అనే గొప్ప కార్యక్రమాన్ని అక్షిత ఫౌండేషన్ వారు చేపట్టడం జరిగింది. ప్రతిరోజు ఇదే విధంగా ఏదోరకంగా పేద ప్రజలకు వాళ్ల వలన చేయగలిగే కొంత సాయాన్ని చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న అక్షిత ఫౌండేషన్ వారికి అంతా మంచే జరగాలని ప్రతి ఒకరం కోరుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని వేడుకుందాం. ఈ కార్యక్రమంలో అక్షిత ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు సభ్యురాలు తానాజీ, వాసవి, లత మరియు మిగతా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.