సెలవులే లేని బడి
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణ
ప్రభుత్వ నిర్ణయాలను భేకరత్ చేస్తున్న అక్షర పాఠశాలను పట్టించుకోని డిఈఓ
చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ సంఘాల డిమాండ్
స్టేషన్ ఘనపూర్: జనగాం నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని బతుకమ్మకు మరియు దసరా పండుగకు ఎనలేని సముచిత స్థానాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న ఎలాంటి పండుగలకు ఇవ్వనని రోజులు సెలవులను ఇస్తూ తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన దసరా పండుగను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో పండుగ సెలవులను ప్రకటిస్తుంటే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ అక్షర ప్లానెట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ అక్షర ప్లానెట్ పాఠశాలలో తరగతులు నడిపిస్తున్నారని మండల విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ కి చరావని ద్వారా ఫిర్యాదు చేశాను. పిర్యాదు పై మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాఠశాలకు వచ్చి విద్యార్థులను ఇంటికి పంపించేశారు. అనంతరం పాఠశాల పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఈరోజు నుండి అనగా అక్టోబర్ 13 నుండి … అక్టోబర్ 25 వరకు దసరా పండగ సెలవులను ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో దాదాపుగా 59 పాఠశాలలు నడుస్తున్నాయని , అందులో ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు నుండి సెలవులను ఇవ్వడం జరిగిందని కానీ అక్షర ప్లానెట్ ప్రయివేట్ పాఠశాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆదేశాలు తుంగలో తొక్కుతూ మాకు ప్రభుత్వ ఆదేశాలతో పనిలేదన్నట్లు నడుచుకుంటూ పండుగ సెలవు దినాలల్లో కూడా పాఠశాలలను కొనసాగిస్తున్నారని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు చుట్టంలా పనిచేస్తుందని జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించినప్పటికీ మండల కేంద్రంలోని అక్షర ప్లానెట్ ప్రైవేట్ పాఠశాల దారి సెపరేట్ అన్నట్లుగా ప్రభుత్వ ఆదేశాలు లెక్క చేయకుండా, సెలవులు పాటించకుండా యధావిధిగా పాఠశాలల నిర్వహిస్తున్నారు. పాఠశాలకు సెలవు ఇవ్వకుండా సెలవు దినాలలో కూడా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల, జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి అక్షర ప్లానెట్ ప్రవేట్ పాఠశాల పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.