కాంట్రాక్టు జాబులు పేరిట మోసం చేస్తున్న అక్షర ఏజెన్సీ

6 నెలలు గడుస్తున్న కాంటాక్ట్ కార్మికులకు ఇప్పటివరకు జీతాలు అందలేదు

డబ్బులు రాకున్నా వస్తాయని ఆశతో డ్యూటీ చేస్తున్న కార్మికులు

అక్షర ఏజెన్సీ మోసం చేసిందని కార్మికులు వాపోతున్నారు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాంటాక్ట్ సంస్థలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి జిల్లా కలెక్టరేట్లో హై స్కూల్ లలో వంద పడకల హాస్పిటల్ లో గవర్నమెంట్ కార్యాలయాలలో జాబులు ఖాళీ ఉన్నాయ్ అంటూ కాంట్రాక్టు సంస్థలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలొ అక్షర ఏజెన్సీ జాబులు ఖాళీ ఉన్నాయ్ అంటూ గత ఆరు నెలల క్రితం 16 మంది సెక్యూరిటీ స్వీపర్ని తీసుకోవడం జరిగింది ఒక స్వీపర్ కాడ అక్షరాల 80.500 వసూల్ చేయడం జరిగింది సెక్యూరిటీ దగ్గర 1.50,000 రూపాలు వసూలు చేసి మోసం చేయడం జరిగింది ఇలా అక్షయ ఏజెన్సీ దోపిడికి పాల్పడుతుంది ఒక సెక్యూరిటీ కి నెల వేతనం వచ్చేసి 15000 రూపాయలు వస్తాయి అని చెప్తూ ఐదు నెలల నుంచి ఇప్పటివరకు కనీస వేతనం కూడా ఇవ్వలేదు అదేవిధంగా స్లీపర్ కి అలానే నెల వేతనం 15,500 వస్తాయి అని చెప్తూ ఇప్పటి వరకి ఒక నెల వేతనం చెల్లించిన రోజు కూడా లేదు ఇలా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీలు దోపిడికి పాల్పడుతున్నాయో ఇంతవరకు పట్టించుకున్న నాథుడే లేడు రెక్కాడితే డొక్కానిందని జనాల కాడ ఇంతగానం దోపిడీకి పాల్పడుతున్న ఏజెన్సీల పైన ఏ అధికారి కూడా నోరు మెదపట్లేదు గత సంవత్సరాల నుండి ఏజెన్సీల పైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఏ అధికారి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వాళ్ల సమస్యకి పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి అత్కూరి శ్రీధర్ డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *