Weighbridge Scam at Akbar Mill Exposed
అక్బర్ మిల్లు వేబ్రిడ్జిలో.. నయా మోసం.
#వే బ్రిడ్జి తో వినియోగదారుల జేబులకు చిల్లు
#కొరవడిన తూనిక కొలత అధికారులు పర్యవేక్షణ.
# మండలంలో తూకంలో ప్రతి దగ్గర మోసమే..?
నల్లబెల్లి, నేటి ధాత్రి :
వే బ్రిడ్జి తూకంలోవినియోగదారుల జేబులకు చిల్లు పడుతున్న సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో వెలుగు చూసింది. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూడడంతో మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కంఠ మహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గోదావరి ఇసుక లారీ లోడు ఆర్డర్ పెట్టారు. అయితే ములుగు జిల్లాలో

నిర్వహిస్తున్న ఇసుక క్వారీ నుండి సదరు డ్రైవర్ 27 టన్నుల ఇసుకను తీసుకురాగా బాధిత గౌడ సంఘం నాయకులు అట్టి ఇసుక లారీని మండలంలోని శనిగరం శివారు అక్బర్ మిల్లులోని వే బ్రిడ్జి పై తూకం వేయగా 39.5 టన్నుల తూకం వచ్చిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సదరు వే బ్రిడ్జి తూకం పై అనుమానం వచ్చిన బాధితులు ఇదే మండలంలోని భార్గవి రైస్ మిల్లు లో గల వే బ్రిడ్జికి ఇసుక లారీ తరలించి మరోమారు తూకం వేయగా 37టన్నుల 120 కేజీల ఇసుక తూకం కు వచ్చిందని తెలిపారు. అయితే కాళీ లారీ వేటు తీసివేయగా లారీలో 27 టన్నుల ఇసుక సదరు లారీ డ్రైవర్ చెప్పిన విధంగా లెక్కకు వచ్చిందని తెలిపారు. అయితే అక్బర్ వే బ్రిడ్జి పై వచ్చిన తూకం 2.5

టన్నుల అంటే 25 క్వింటాళ్ల ఇసుక అదనంగా వెయిట్ చూపడం వల్ల తాము టన్ను ఇసుకకు ఒక్కంటికి రూ, 1600 లెక్క చొప్పున రూ, 4000 అదనంగా లారీ ఓనర్ కు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత గౌడ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల కేంద్రానికి చెందిన ఒక వ్యాపారి రైతు వద్ద వరి ధాన్యం కొనుగోలు చేసిన 15 బస్తాలు ను సదరు అక్బర్ వే బ్రిడ్జి పై కాంట వేయగా11 క్వింటాల40

కేజీలు రాగా మరో మిల్లు వద్ద తూకం వేయగా 90 కేజీలు తేడా వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.ఇకనైనా సంబంధిత తూనికల కొలతల ( లీగల్ మెట్రాలజీ ) అధికారులు స్పందించి తూకంలో వినియోగదారులను నిండా ముంచుతున్న అక్బర్ వే బ్రిడ్జి పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
